ఓటీటీ లోకి 'టూరిస్ట్ ఫ్యామిలీ'!

తమిళ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'టూరిస్ట్ ఫ్యామిలీ'.;

By :  S D R
Update: 2025-05-30 03:12 GMT

తమిళ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'టూరిస్ట్ ఫ్యామిలీ'. శశి కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ చిత్రం, మానవతా విలువలు హృదయాన్ని స్పృశించే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

'టూరిస్ట్ ఫ్యామిలీ' కథ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఒక తమిళ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబం భారతదేశంలో చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది, కానీ వారి గుర్తింపును దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో రామేశ్వరం సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటన వారి జీవితాలను మరింత సంక్లిష్టం చేస్తుంది. పోలీసుల దర్యాప్తు, ఈ కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు, మరియు వారి జీవితంలో మానవతా విలువలు ఎలా ప్రకాశిస్తాయి అనే అంశాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. సీనియర్ నటులు శశి కుమార్, సిమ్రాన్ లతో పాటు కమెడియన్ యోగి బాబు నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది.

చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికే 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి దర్శకధీరుడు రాజమౌళి మొదలుకొని చాలామంది సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురిచింది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో 'టూరిస్ట్ ఫ్యామిలీ' స్ట్రీమింగ్ కానుంది.

Tags:    

Similar News