ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ ‘తుడరుమ్’
థియేటర్లలో దుమ్మురేపిన 'తుడరుమ్' ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ రోజునుంచే స్ట్రీమింగ్ అవుతోంది.;
ఈ ఏడాది లెజెండరీ మలయాళ హీరో మోహన్‌లాల్ నటించిన 'ఎంపురాన్, 'తుడరుమ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. ముఖ్యంగా 'తుడరుమ్' సినిమాపై ప్రారంభంలో అంతగా అంచనాలు లేకపోయినప్పటికీ, అనూహ్యంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కేరళలో మొట్టమొదటి రూ. 100 కోట్ల గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది. విమర్శకుల నుండి అద్భుతమైన రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా, రోజురోజుకూ ప్రేక్షకుల ఆదరణతో బలం పుంజుకుంటూ వెళ్ళింది.
థియేటర్లలో దుమ్మురేపిన 'తుడరుమ్' ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ రోజునుంచే స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రన్‌కు 5 వారాల విండో సెట్ చేయగా.. ఓటీటీలో కూడా ఈ సినిమా గట్టి వ్యూస్ ను నమోదు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
'తుడరుమ్' చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో శోభన మోహన్ లాల్ భార్యగా నటించగా.. ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాజిల్ (ఫహద్ ఫాజిల్ తమ్ముడు), మణియన్‌పిళ్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని, బైజు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి నటుడి పాత్ర కథలో లోతైన ప్రభావాన్ని చూపిందని... వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని విమర్శకులు ప్రశంసించారు. ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎం. రంజిత్ నిర్మించారు. సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.