‘ది రాయల్స్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే !

'ది రాయల్స్', మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూడండి. అంటూ ఒక ప్రత్యేకమైన నోట్ తో మేకర్స్ ఈ వెబ్ సిరీస్ గురిచి ప్రకటించారు.;

By :  K R K
Update: 2025-04-20 05:13 GMT

భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన "ది రాయల్స్" వెబ్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించడంతో పాటు.. కొత్త ఆసక్తికర పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో భూమి, ఇషాన్ ఇద్దరూ ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. మే 9న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ కాబోతోంది.

ఒక జిద్ధి రాజకుమారుడు, ఒక గర్ల్‌బాస్ ఆంకుమారిని కలిస్తే...? రాయల్ గందరగోళమా, లేక మంచి ప్రేమకథా? 'ది రాయల్స్', మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూడండి. అంటూ ఒక ప్రత్యేకమైన నోట్ తో మేకర్స్ ఈ వెబ్ సిరీస్ గురిచి ప్రకటించారు.

ఈ సిరీస్‌లో భూమి పెడ్నేకర్ "సోఫియా శేఖర్" అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు, ఆమె వర్క్ పొటాటో అనే కంపెనీ సీఈఓగా ఉంటారు. ఇషాన్ ఖట్టర్ "అవిరాజ్ సింగ్" అనే రాజకుమారుడిగా నటిస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదలైన టీజర్‌లో మొర్పూర్ రాజ కుటుంబం యొక్క రాయల్ లైఫ్ ను చూపించారు. ఇందులో భూమి పాత్ర, ఇషాన్ పాత్ర మధ్య ఘర్షణలు కనిపించాయి.

ఈ సిరీస్‌ను ప్రియాంక ఘోష్ మరియు నుపుర్ అస్తానా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. జీనత్ అమాన్, సాక్షి తన్వర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, చంకీ పాండే, విహాన్ సమత్, కావ్య త్రేహాన్, సుముఖి సురేష్, ఉదిత్ అరోరా, లీసా మిశ్రా, ల్యూక్ కెన్నీ లాంటి ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో భాగమయ్యారు.

ది రాయల్స్ ఒక రాజ కుటుంబం ఆధారంగా సాగుతుంది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా జీనత్ అమాన్ ను కొత్త అవతారంలో చూడబోతున్నారు ప్రేక్షకులు. జైపూర్‌లోని ఒక అద్భుతమైన మహల్‌లో షూట్ చేశారు. మరి ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. 



Tags:    

Similar News