ఆకట్టుకుంటోన్న ‘ది గుడ్ వైఫ్’ టీజర్ !

ఆమె మళ్లీ కోర్టు గౌన్ వేసుకుని, తన ఫ్యామిలీ గౌరవాన్ని, భర్త పేరును కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది.;

By :  K R K
Update: 2025-06-14 01:06 GMT

ఒక్క స్కాండల్‌తో ఎన్నో జీవితాలు అతలాకుతలం అవుతాయి. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ "గుడ్ వైఫ్" అలాంటి ఒక ఇంటెన్స్ స్టోరీతో రాబోతోంది. ఈ సిరీస్‌లో ప్రియమణి ఒక లాయర్‌గా కెరీర్‌ని వదిలేసి గృహిణిగా సెటిల్ అయిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. కానీ, ఆమె లైఫ్‌లో డ్రామా మొదలవుతుంది. ఆమె భర్త సంపత్ రాజ్ ఒక భారీ సెక్స్ అండ్ పొలిటికల్ కరప్షన్ స్కాండల్‌లో ఇరుక్కుంటాడు. దీంతో.. ఆమె మళ్లీ కోర్టు గౌన్ వేసుకుని, తన ఫ్యామిలీ గౌరవాన్ని, భర్త పేరును కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది.

టీజర్ చూస్తేనే గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఇదొక థ్రిల్లింగ్ లీగల్ డ్రామా, ఎమోషనల్ రోలర్‌కోస్టర్. ప్రియమణి తన ఫ్యామిలీని ఈ స్కాండల్ నుంచి బయట పడేయడానికి చేసే స్ట్రగుల్‌ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరిస్తుంది . ఈ సిరీస్ జియో హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక దీన్ని డైరెక్ట్ చేస్తోన్నది స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రేవతి కావడం విశేషం.

అమెరికన్ లీగల్-పొలిటికల్ డ్రామా "ది గుడ్ వైఫ్" కిది అఫీషియల్ అడాప్టేషన్. రేవతి దీన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తుండడం విశేషం. ప్రియమణితో పాటు, ఈ సిరీస్‌లో ఆరి అర్జునన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాకీ కాస్ట్ డీటెయిల్స్, రిలీజ్ డేట్ ఇంకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సిరీస్‌పై అంచనాలు మాత్రం ఇప్పటి నుంచే స్కై హైలో ఉన్నాయి.


Full View

Tags:    

Similar News