కార్గిల్ కథలో సిద్ధార్థ్.. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్!
భారతదేశ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన కార్గిల్ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. భారత వైమానిక దళం చేపట్టిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఆధారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌లో నటుడిగా సిద్ధార్థ్‌కి ముఖ్యపాత్ర దక్కిందట. ఇతర కీలక పాత్రల్లో జిమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా వంటి వారు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
కార్గిల్ సమరంలో భారత వైమానిక దళం అమలుచేసిన వ్యూహాలు, సైనికుల చూపిన సాహసాలను ఈ వెబ్‌సిరీస్‌లో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
కెరీర్ పరంగా చూస్తే, ఇది సిద్ధార్థ్‌కు కీలక అవకాశంగా మారనుంది. గత కొంతకాలంగా సిద్ధార్థ్‌కు ఆశించిన విజయాలు దక్కడం లేదు. దీంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లలో సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. కార్గిల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్టోరీ యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉండటంతో, సక్సెస్ సాధిస్తే సిద్ధార్థ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.