ఓటీటీ లోకి రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
ఓటీటీ లోకి రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
వెంకటేష్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఆయన యాక్టింగ్, టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉండటంతో సినిమా హాస్యభరితంగా సాగింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కుటుంబ అనుబంధాలు, వినోదం మేళవించిన కథా కథనం ఆకట్టుకుంది.
ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి, నైజాంలో ఏకంగా రూ. 40 కోట్ల లాభాన్ని అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని ఏరియాల్లో సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.
సినిమా థియేటర్లలో దూసుకుపోతుండగానే, త్వరలోనే ఓటీటీలోనూ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ 5 ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.