ఓటీటీలో 'సలార్' సెన్సేషన్!
రెబెల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' థియేట్రికల్ గా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావొస్తుంది. 2023, డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా.. ఆ తర్వాత కొద్ది రోజులకే నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.;
రెబెల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' థియేట్రికల్ గా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావొస్తుంది. 2023, డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా.. ఆ తర్వాత కొద్ది రోజులకే నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక అప్పటినుంచి.. ఇప్పటివరకూ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో టాప్-10 లో ట్రెండ్ అవుతుండటం ఓ అరుదైన రికార్డుగా చెబుతున్నారు.
సినిమా రిలీజై 450 రోజులు గడిచినా.. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10లో 'సలార్' ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కి దేశవ్యాప్తంగా భారీగా ఆదరణ లభిస్తోంది. మరోవైపు హాట్ స్టార్ లోనూ 'సలార్' అందుబాటులో ఉంది. అక్కడ కూడా చాలా నెలల పాటు ఈ చిత్రం ట్రెండింగ్ లో కొనసాగింది.
'సలార్' చిత్రంలో ప్రభాస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెవర్ బిఫోర్ గా చూపించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులు, ఎలివేషన్ సీన్లు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో కొన్ని వారాలే ట్రెండ్ అవుతాయి. కానీ 'సలార్' 15 నెలల తరువాత కూడా అదే దూకుడు కొనసాగిస్తుండటం అసాధారణం.