ఓటీటీ లోకి ‘రాబిన్ హుడ్‘

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్‘.;

By :  S D R
Update: 2025-05-03 11:02 GMT

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్‘.యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ గా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే.. నితిన్, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, జి.వి.ప్రకాష్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది.

లేటెస్ట్ గా ‘రాబిన్ హుడ్‘ మూవీ ఓటీటీ లోకి వస్తోంది. ఓటీటీ వేదికపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జీ5 (ZEE5) వేదికగా మే 10 నుంచి ‘రాబిన్ హుడ్‘ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. మరి.. ఓటీటీలో ‘రాబిన్ హుడ్‘కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News