ఓటీటీలోకి రాబోతున్న రివెంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ !
దసరా పండుగను నేపథ్యంగా చేసుకొని రూపొందించిన రివెంజ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘ఓం కాళీ జై కాళీ’. త్వరలో ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విమల్, సీమా బివాస్, ఆర్.ఎస్. శివాజీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు రాము చెల్లప్ప దర్శకత్వం వహించారు.
తాజాగా... ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 28న ‘జియో హాట్‌స్టార్’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ .. చిత్రబృందం తమిళ్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ వెబ్‌సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఓ ఎమ్మెల్యే హత్య వార్తతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. వరుస హత్యలు, గంభీరమైన జాతర సన్నివేశాలు కలబోసిన ఈ కథాంశానికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ థ్రిల్లింగ్ కథ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే.