ఈ మలయాళ చిత్రం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే !
తాజా సమాచారం ప్రకారం 'రేఖాచిత్రం' మూవీని సోనీ లివ్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.;
జోఫిన్ టి. చాకో దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'రేఖాచిత్రం'. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 జనవరి 9న థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందింది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం 'రేఖాచిత్రం' మూవీని సోనీ లివ్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా థియేట్రికల్ విడుదలైన 45 రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ లో విడుదలవుతాయి, కానీ ఈ కాలపరిమితి స్థిరంగా ఉండదు. కొన్ని సినిమాలు ముందుగానే విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో 'రేఖాచిత్రం' ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో అందుబాటులో ఉంటుందని ఊహిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఈ చిత్రకథ మలక్కప్పారాలో జరుగుతుంది. అక్కడ వికేక్ అనే వ్యక్తి ఎస్‌హెచ్‌ఓగా నియమితుడై.. రాజేంద్రన్ అనే వ్యక్తి ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తాడు. పరిశీలనలో.. రాజేంద్రన్ చేసిన నేరాలు, ఒక యువతి అదృశ్యమైన మిస్టరీ వంటి షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తాయి. రమేష్ పిశారడీ, సిద్దిఖ్, జగదీష్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్, ఇంద్రన్స్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రంలో నటించారు.
'రేఖాచిత్రం' మూవీని 2024 ఆగస్టు 13న అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ 2024 మే 3న ప్రారంభమై.. 2024 జూలై 15న ముగిసింది. ఈ చిత్రాన్ని కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు అన్న్ మేగా మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ థియేట్రికల్ విడుదల తర్వాత మంచి వసూళ్లను సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹28.3 కోట్ల కలెక్ట్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.