‘రానానాయుడు’ సీజన్ 2 టీజర్ వచ్చేసింది !

రానానాయుడు రెండో సీజన్‌తో మరింత ఆసక్తి రేకెత్తిస్తూ ‘రానా నాయుడు’ ప్రేక్షకులకు ఒక కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.;

By :  K R K
Update: 2025-02-04 00:40 GMT

"రానా నాయుడు" సీరీస్ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించింది. దగుబాటి బాబాయ్, అబ్బాయిలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఈ వెబ్ సీరీస్.. కరణ్ అన్షుమన్, సువర్ణ్ వర్మ సంయుక్త దర్శకత్వంలో రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సీరీస్ మొదటి సీజన్  సూపర్ హిట్ అయింది. రెండేళ్ల క్రితం సీరీస్ ప్రారంభం అయ్యి.. టాప్ లిస్ట్ లో నిలిచింది. ఇప్పుడు.. రెండో సీజన్‌తో మరింత ఆసక్తి రేకెత్తిస్తూ ‘రానా నాయుడు’ ప్రేక్షకులకు ఒక కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

మొదటి సీజన్ లో బూతులు ఎక్కువగా ఉన్నా కానీ , అవే సీరీస్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ సీరీస్‌లో వెంకటేష్ అండ్ రానా తండ్రి కొడుకులుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా.. సీజన్ 2 టీజర్ విడుదలై కొత్త అంచనాలను ఏర్పరచింది. టీజర్ లో యాక్షన్‌ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రానా వర్సెస్ వెంకటేష్ ఫైట్ కంటిన్యూ అవుతుందని అర్థమవుతోంది. ఈ సీజన్ లో వెంకటేష్ తనకు భిన్నమైన పాత్రలో కనిపిస్తారు, అలాగే రానా కూడా మరింత బలంగా కనిపించనున్నారు.

"రానా నాయుడు" సీరీస్ సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ నుండి కూడా మంచి స్పందన అందుకుంది. సీజన్ 2 కూడా తొలినుంచే పెద్ద హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. టీజర్ నుంచి స్పష్టంగా కనిపించే విషయమేమంటే.. ఈ సీజన్ మొదటి సీజన్ ని మించిన విజయం సాధించవచ్చు.

Tags:    

Similar News