రానా స్ట్రాంగ్.. వెంకీ వీక్?

బాలీవుడ్ హీరోలు చాలా ముందుగానే వెబ్ సిరీస్ ఫార్మాట్‌కు అలవాటు పడిపోయారు. డిజిటల్ దునియా మొదలైన కొత్తల్లోనే బాలీవుడ్ హీరోలు వాటిల్లో నటించడం మొదలు పెట్టారు.;

By :  S D R
Update: 2025-06-15 02:02 GMT

బాలీవుడ్ హీరోలు చాలా ముందుగానే వెబ్ సిరీస్ ఫార్మాట్‌కు అలవాటు పడిపోయారు. డిజిటల్ దునియా మొదలైన కొత్తల్లోనే బాలీవుడ్ హీరోలు వాటిల్లో నటించడం మొదలు పెట్టారు. సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్ వంటి హీరోలంతా వెబ్ సిరీస్ లలో దుమ్మురేపారు.

ఈ ట్రెండ్ సౌత్ లో కాస్త లేటుగా వచ్చింది. దక్షిణాది నుంచి అగ్ర కథానాయకుల్లో వెంకటేష్, రానా కలిసి 'రానా నాయుడు' సిరీస్ చేశారు. హాలీవుడ్ సిరీస్ ‘రే డొనోవన్’ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ షో మొదటి సీజన్‌ మంచి విజయాన్ని సాధించింది.

అయితే వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్ లో బూతు డైలాగులు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ చేశారు. వెంకీ వంటి ఫ్యామిలీ స్టార్ నుండి అలాంటి కంటెంట్ ను ఊహించలేదు అభిమానులు. కట్ చేస్తే.. ఇప్పుడు 'రానా నాయుడు' సీజన్ 2 వచ్చింది.

ఇప్పుడు వచ్చిన సీజన్ 2లో బోల్డ్ కంటెంట్ ను తగ్గించారు. కానీ కంటెంట్ వీక్ గా ఉండడం, వెంకటేష్ పాత్రకు ప్రయారిటీ లేకపోవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగించిందని చెప్పాలి. మరోవైపు.. ఈ సీజన్‌లో రానా పాత్ర బలంగా ఉండటం దగ్గుబాటి ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో 'రానా నాయుడు-2' స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    

Similar News