ఓటీటీలోకి ‘పుష్ప 2’ ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే.. !

‘పుష్ప 2’ చిత్రం జనవరి 30, 2025 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.;

By :  K R K
Update: 2025-01-27 14:31 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ . మొదటి భాగాన్ని మించి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు దానికి సమయం ఆసన్నమైంది.

‘పుష్ప 2’ చిత్రం జనవరి 30, 2025 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకి డిజిటల్ హక్కులు సొంతం చేసుకుని.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన “పుష్ప 2” బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రత్యేకంగా హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించింది.

ఓటీటీ వెర్షన్ కోసం చిత్ర నిర్మాణ బృందం 3 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న పూర్తి వర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ సినిమా థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల నిడివితో విడుదల కాగా, ఆ తర్వాత “పుష్ప 2 రీలోడెడ్” పేరిట అదనంగా 20 నిమిషాల ఫుటేజీతో మరోసారి విడుదల చేశారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ఒరిజినల్ వెర్షన్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

“పుష్ప 2” భారీ విజయాన్ని సాధించినప్పటికీ, వివాదాలు, పోలీసు కేసుల కారణంగా విజయోత్సవాలను జరుపుకోలేకపోయింది. రష్మికా మందన్న కథానాయికగా నటించిన ఈ సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే ఐకానిక్ మూవీగా చరిత్రకెక్కింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంకే రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి. 

Tags:    

Similar News