ఈ వారం థియేటర్లు, ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే !
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్", రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన "గేమ్ ఛేంజర్", వెంకటేశ్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే వీటిలో .. వెంకీమామ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక సంక్రాంతి ముగియడంతో థియేటర్ సందడి తగ్గిపోగా, ప్రేక్షకులు కొత్తగా విడుదలవుతున్న ఓటీటీ కంటెంట్‌పై దృష్టి పెట్టారు.
ఈ వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా రజాకార్, మలయాళ 3డీ చిత్రం బరోజ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇవి కాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్:
ది నైట్ ఏజెంట్ - సీజన్ 2 (వెబ్ సిరీస్): జనవరి 23
షాఫ్డెట్ (కామెడీ సిరీస్): జనవరి 24
ది శాండ్ క్యాస్టిల్ (హాలీవుడ్ సినిమా): జనవరి 24
ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్ (కొరియన్ సినిమా): జనవరి 24
అమెజాన్ ప్రైమ్ వీడియో:
హర్లీమ్ - సీజన్ 3 (వెబ్ సిరీస్): జనవరి 23
జీ5:
హిసాబ్ బరాబర్ (హిందీ మూవీ): జనవరి 24
ఆహా:
రజాకార్ (టాలీవుడ్ సినిమా): జనవరి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
బరోజ్ 3డీ (మలయాళ సినిమా): జనవరి 22
స్వీట్ డ్రీమ్స్ (వెబ్ సిరీస్): జనవరి 24
సో.. ఈ వారం కొత్త కంటెంట్‌తో థియేటర్లు, ఓటీటీలు ప్రేక్షకులకు మళ్లీ వినోదాన్ని అందించనున్నాయి. మీరు ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్‌లో మీకు నచ్చిన సినిమా లేదా సిరీస్‌ను చూసేయండి!