డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న నయనతార మూవీ !

Update: 2025-01-21 08:50 GMT

డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న నయనతార మూవీ !క్రికెట్‌ నేపథ్యంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘ది టెస్ట్‌’ . ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని వైనాట్‌ స్టూడియోస్‌ నిర్మించగా, ప్రముఖ నిర్మాత శశికాంత్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా.. మాధవన్, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో, మలయాళ నటీమణి మీరా జాస్మిన్‌ కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నారు.

చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో నయనతార ‘కుముద’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్‌’, ‘నెట్రికన్‌’ చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఈ సినిమా తర్వాత నయనతార చేతిలో ‘డియర్‌ స్టూడెంట్స్‌’, ‘అమ్మోరు తల్లి 2’ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు, మరిన్ని ప్రాజెక్టులతో నయన్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

‘ది టెస్ట్‌’ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. నయనతార అభిమానులు ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ది టెస్ట్‌’ మూవీ క్రికెట్‌, జీవితం అనే రెండు ప్రధాన అంశాలను అద్భుతంగా మేళవించిన చిత్రంగా నిలుస్తుందని అంచనా.

Tags:    

Similar News