‘మయసభ’ లోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య ?

ప్రముఖ దర్శకుడు, రచయిత దేవా కట్టా ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి మాగ్నం ఓపస్ యస్. యస్. యం.బి. 29 కోసం డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనే ‘మయసభ’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-04-21 01:17 GMT

ఆసక్తికరమైన ప్రాజెక్టులతో తన కెరీర్ ను చాలా బలంగా తీర్చిదిద్దుకుంటున్నాడు అక్కినేని నవయువ సమ్రాట్ నాగచైతన్య. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం... 'దూత' తో వెబ్ సిరీస్ లో భారీ విజయాన్ని అందుకున్న నాగచైతన్య, మళ్లీ ఈ మాధ్యమంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ దర్శకుడు, రచయిత దేవా కట్టా ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి మాగ్నం ఓపస్ యస్. యస్. యం.బి. 29 కోసం డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనే ‘మయసభ’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల.. తన ఎక్స్ అకౌంట్ ద్వారా దేవా కట్టా 'మయసభ' సీజన్ 1 మొత్తం 400 నిమిషాల రన్‌టైమ్ తో రానుందని.. ఇది ఈ ఏడాది చివరిలో విడుదల కానుందని తెలిపారు. ఆయన తనకు ఇష్టమైన నటుడితో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నట్లు సూచించినా.. తాజా సమాచారం ప్రకారం.. ఆ నటుడు మరెవరో కాదు.. నాగచైతన్యనే అని స్పష్టం చేశారు.

'మయసభ' ఒక పొలిటికల్ క్రైమ్ డ్రామా గా రూపొందించబడుతుంది. ఇది చాలా రియలిస్టిక్ టోన్ లో తెరకెక్కనుంది. మేకర్స్ అధికారికంగా త్వరలో ప్రకటన చేయనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్-మిస్టరీ సిరీస్‌లో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ 2023 డిసెంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అయింది. దీనికి మంచి పేరొచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ నాగచైతన్యకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Tags:    

Similar News