ఓటీటీలోకి ‘ముఫాసా: ది లయన్ కింగ్’

Update: 2025-03-13 03:09 GMT

సింహాసనం కోసం జరిగే రాజకీయ కుతంత్రాలు.. మన సినీ ప్రపంచంలో కొత్త కాదు. అలాంటి పవర్‌ఫుల్ కథతో తెరకెక్కిన హాలీవుడ్ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ చిత్రం, ప్రేక్షకులను తన మాయాజాలంతో అలరించింది.

ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ముఫాసా పాత్రకు ప్రముఖ నటుల డబ్బింగ్. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో షారుక్ ఖాన్ ఈ పాత్రకు స్వరాన్నిచ్చారు. ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ వేదికగా మరోసారి అభిమానుల ముందుకు రాబోతోంది. జియో హాట్‌స్టార్ ద్వారా మార్చి 26 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది.

ఈ సినిమా, 2019 లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ ‌కు ప్రీక్వెల్‌గా రూపొందించ బడింది. ముఫాసా తన రాజ్యాన్ని ఎలా సాధించాడు? అతని గతం ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథలో ఆవిష్కరించారు. రాజకీయ మలుపులు, సాహసోపేత ఘట్టాలు, సంగీత మాయాజాలంతో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తప్పక చూడాల్సిన చిత్రం.

Tags:    

Similar News