‘మీర్జాపూర్ 4’ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే.. !
గ్రిప్పింగ్ స్టోరీలైన్, పవర్ఫుల్ డైలాగ్స్, వాస్తవిక పాత్రలతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రైమ్ డ్రామా మరిన్ని ట్విస్టులు, హింసతో తిరిగి రానుంది. ఈ సీజన్‌లో రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కూడా చేరడంతో అంచనాలు మరింత పెరిగాయి.;
‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ సీజన్ 4 కోసం ఎదురుచూపులు ముగియనున్నాయి. కొత్త సీజన్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం అధికారికంగా మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ 2026 జనవరిలో ప్రసారం కానుంది.
గ్రిప్పింగ్ స్టోరీలైన్, పవర్ఫుల్ డైలాగ్స్, వాస్తవిక పాత్రలతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రైమ్ డ్రామా మరిన్ని ట్విస్టులు, హింసతో తిరిగి రానుంది. ఈ సీజన్‌లో రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కూడా చేరడంతో అంచనాలు మరింత పెరిగాయి.
గత సీజన్‌లో గుడ్డు భయ్యా సాధించిన ఆధిపత్యం తర్వాత అతని భవితవ్యం ఎలా ఉంటుంది, కాలీన్ భయ్యా తన సింహాసనాన్ని తిరిగి దక్కించుకుంటాడా అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఆసక్తికరమైన కథ, అద్భుతమైన నటీనటులతో ‘మీర్జాపూర్ సీజన్ 4’ 2026లో అతిపెద్ద ఓటీటీ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.