ఓటీటీలోకి రానున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
సెప్టెంబర్ 23 నుంచి సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సినిమా ఓటీటీలోకి వస్తోంది.;
By : K R K
Update: 2025-09-18 00:44 GMT
నారా రోహిత్ హీరోగా వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా "సుందరకాండ". ఈ మూవీ డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టనుంది. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లుగా వ్రితి వాఘని మరియు శ్రీదేవి విజయకుమార్ నటించారు.
సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు, సెప్టెంబర్ 23 నుంచి సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సినిమా ఓటీటీలోకి వస్తోంది.
తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో కూడా సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.