ఆహాలో అదరగొడుతోన్న మలయాళ కామెడీ డ్రామా !

చాకో కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘వివేకానందన్ వైరల్’ గత ఏడాది మంచి స్పందన పొందింది.;

By :  K R K
Update: 2025-02-09 13:40 GMT

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో. తెలుగులోనూ ఇతడు పవర్‌ఫుల్ విలన్‌గా తనకున్న ఇమేజ్‌ను మరింత బలపర్చుకుంటున్నాడు. సాధారణంగా కనిపిస్తూనే బలమైన నెగటివ్ షేడ్స్‌ను సమర్థంగా పలికించడం ఆయన ప్రత్యేకత. చాకో కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘వివేకానందన్ వైరల్’ గత ఏడాది మంచి స్పందన పొందింది.

ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సీనియర్ దర్శకుడు కమల్ తెరకెక్కించిన ఈ చిత్రం కామెడీ డ్రామా జానర్‌లో రూపుదిద్దుకుంది. ఇందులో శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై కీలక పాత్రలు పోషించారు.

ఎస్పీ వివేకానందన్‌ (షైన్‌ టామ్‌ చాకో) మహిళలను వివాహం చేసుకుని, వారిని మోసం చేస్తూ ఉంటాడు. అతడి భార్య సితార (శ్వాసిక విజయ్) ఓ పల్లెటూరిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. వివేకానందన్‌ నగరంలో ఉద్యోగం చేస్తుండటంతో భార్య ఇంట్లో లేనప్పుడు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే చివరికి సితార, మిగిలిన బాధిత మహిళలు అతనికి గుణపాఠం నేర్పించేందుకు ఏం చేశారు? వారి నిర్ణయం వివేకానందన్‌ను ఏ రీతిగా చిక్కుల్లో పడేసింది? అనేదే అసలు కథ. నటీనటుల అభినయం, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో ట్రెండింగ్ అవుతోంది. 

Tags:    

Similar News