ఓటీటీలో అదరగొడుతోన్న మలయాళ యాక్షన్ మూవీ!

నటుడిగా మాత్రమే కాకుండా.. తొలిసారిగా దర్శకుడిగా మారి ‘పని’ అనే రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు జోజు .;

By :  K R K
Update: 2025-01-23 06:22 GMT

మాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న జోజు జార్జ్... తన బహుముఖ ప్రజ్ఞతో ఆడియన్స్ ను విశేషంగా మెప్పిస్తాడు . ‘నాయాట్టు’, ‘ఇరట్ట’ వంటి సినిమాల్లో తన నటనతో పలు అవార్డులు గెలుచుకున్న జోజు.. ఇటీవలే టాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘ఆదికేశవ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రభావవంతమైన నటనతో ఆడియన్స్ ను మెప్పించడం జోజు స్టైల్.

అయితే, నటుడిగా మాత్రమే కాకుండా.. తొలిసారిగా దర్శకుడిగా మారి ‘పని’ అనే రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు జోజు . 2024లో అక్టోబర్ 24న విడుదలైన ఈ చిత్రం మలయాళ సినీ ప్రేక్షకుల మన్ననలు అందుకోవడమే కాకుండా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జోజు.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు.

‘పని’ సినిమా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి దాదాపు రూ. 37.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కథ పాతదే అయినప్పటికీ, జోజు కథనానికి కొత్తదనాన్ని జోడించడం వల్ల ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 16న ఓటిటి విడుదలైన ఈ మలయాళ సూపర్ హిట్ రివెంజ్ మూవీ, కథాకథనాల పరంగా  ఎంగేజింగ్ గా  ఉండటంతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.

Tags:    

Similar News