ఓటీటీలోకి రాబోతున్న సూపర్ మల్లూ వెబ్ సిరీస్ !
"లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్" ప్రేమ కథలకు కొత్తదనం జోడిస్తూ.. నేటి తరానికి అనుగుణంగా రూపొందించబడింది.;
మలయాళ సినిమా ఇటీవల థ్రిల్లర్స్, వెబ్ షోస్, షార్ట్ ఫిల్మ్స్ వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లను అందిస్తూ దేశీయ సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. ఇప్పుడు, మరో అత్యంత ఆసక్తికరమైన వెబ్ సిరీస్ "లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్" త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ కొత్త తరం ప్రేమకథపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ మలయాళం లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇప్పటి వరకు అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు. అయినప్పటికీ, ఇది ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. "లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్" ప్రేమ కథలకు కొత్తదనం జోడిస్తూ.. నేటి తరానికి అనుగుణంగా రూపొందించబడింది. ఈ సిరీస్ ప్రేమలో ఉన్న ఓ జంట కథను ఆసక్తికరంగా చూపించనుంది.
హీరో వినోద్.. తన ప్రేయసిని జీవితాంతం తనతో కలిపే లక్ష్యంతో కొత్తగా ఇల్లు కట్టాలని కలలు కంటాడు. కానీ ఆ కల, వాస్తవ జీవనంలో అనేక సమస్యలను తెస్తుంది. ఇంటిని నిర్మించుకోవడం, ప్రేమను నిలుపుకోవడం.. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణను హాస్యంతో కూడిన శైలిలో ఆవిష్కరించారు. నీరజ్ మాధవ్, అజు వర్గీస్, గౌరీ జి కిషన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించగా.. ఈ సిరీస్ ను విష్ణు జి. రాఘవ్ డైరెక్ట్ చేశాడు. ఆయన గతంలో టొవినో థామస్ నటించిన "వాశి" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను రేజాపుత్ర విజువల్ మీడియా నిర్మించింది.