ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న కన్నడ సినిమాలు ఇవే !
కథ, శైలిలో తేడాలున్నా, యాక్షన్, సైఫై, రొమాన్స్, హాస్యం అన్నీ కలిపి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి.;
కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాక్స్', ఉపేంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన 'యూఐ.. ఈ రెండు పెద్ద కన్నడ సినిమాలు ఫిబ్రవరి 2025లో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన వెరైటీ సినిమా 'యూఐ'. ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో సత్య, కల్కిల మధ్య జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ఈ కథ ద్వారా అధికారం, సాంకేతికత, విజ్ఞానం వంటి అంశాలను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించారు. లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై జి.మనోహర్, కె.పి.శ్రీకాంత్ నిర్మించిన చిత్రానికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషించాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ఈ చిత్రం కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలైంది. త్వరలోనే జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.
విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'మాక్స్' కన్నడలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాలలో ఒకటి. డిసెంబర్ 25, 2024న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో.. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అర్జున్ మహాక్షయ్ పాత్రను కిచ్చా సుదీప్ మాసీవ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పోషించారు. సుకృత వాగ్లే, వరలక్ష్మీ శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, అనిరుద్ భట్, ఇలవరసు వంటి ప్రముఖ తారాగణంతో రూపొందిన ఈ సినిమా, పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడే ఆఫీసర్‌కి ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన పరిమితుల మధ్య ఎలా పోరాడతాడనే కథతో తెరకెక్కింది. ఈ సినిమా త్వరలోనే జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఈ రెండు సినిమాలు కథ, శైలిలో తేడాలున్నా, యాక్షన్, సైఫై, రొమాన్స్, హాస్యం అన్నీ కలిపి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. ఓటీటీలో కూడా ఈ మూవీస్ అలరించబోతున్నాయి.