'జాక్' ఓటీటీ లోకి వచ్చేస్తుంది!
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.;
By : S D R
Update: 2025-05-06 02:36 GMT
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 10న వేసవి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'జాక్' స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా 'జాక్' అందుబాటులోకి రానుంది. గతంలో 'డీజె టిల్లు, టిల్లు స్క్వేర్' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న సిద్దు హిట్ పరంపరకు 'జాక్' బ్రేక్ వేసింది. అయితే.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.