ఓటీటీలోనూ అదరగొడుతున్నాయి !

మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ హాట్‌స్టార్‌లో రిలీజై అక్కడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. మరోవైపు సూర్య నటించిన ‘రెట్రో’ కూడా అందుబాటులో ఉంది. అయితే, అభిమానులు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కూడా ఓటీటీలో అదరగొడుతోంది.;

By :  K R K
Update: 2025-06-03 01:34 GMT

సినీ ప్రేమికులు ‘ఖలేజా’ సెలబ్రేషన్స్‌తో పాటు థియేటర్లలో ‘భైరవం’ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌పై కొత్త రిలీజుల కోసం కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఒకవైపు మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ హాట్‌స్టార్‌లో రిలీజై అక్కడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. మరోవైపు సూర్య నటించిన ‘రెట్రో’ కూడా అందుబాటులో ఉంది. అయితే, అభిమానులు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కూడా ఓటీటీలో అదరగొడుతోంది.

‘తుడరుమ్, టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రాలు థియేట్రికల్ రిలీజెస్ లో భారీ ఆదరణ పొందాయి. ‘తుడరుమ్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంతకంటే పెద్ద విజయం సాధించింది. శశికుమార్, సిమ్రన్ జోడీగా నటించిన ఈ సినిమా శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు అభిషన్ జీవింత్. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది.

‘తుడరుమ్’ తెలుగులో రిలీజ్ కాగా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తెలుగులో రిలీజ్ కాలేదు. అందుకే ఓటీటీలో ఈ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ అండ్ ‘తుడరుమ్’ చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందించి, బాక్సాఫీస్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించాడు. ‘తుడరుమ్’ అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఊహించని విధంగా సంచలనం సృష్టించి, కేరళలో మొదటి రూ. 100 కోట్ల గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. మొత్తానికి ఓటీటీలో ‘తుడరుమ్ , టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రాలు అదరగొడుతున్నాయి.

Tags:    

Similar News