నెట్‌ఫ్లిక్స్ కి క్యూ కట్టిన ఫిబ్రవరి సినిమాలు!

Update: 2025-03-03 02:52 GMT

ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజు గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి 'విడాముయార్చి, తండేల్'. ఇప్పుడు రెండు చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. వీటిలో ఇప్పటికే అజిత్ 'విడాముయార్చి' ఈరోజు (మార్చి 3) నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నాగచైతన్య బ్లాక్‌బస్టర్ 'తండేల్' మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది.




 


కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నా, విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా తెలుగులో 'పట్టుదల' పేరుతో విడుదలైంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.




 నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల నిజజీవిత సంఘటనను ఆధారంగా రూపొందించారు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. తెలుగు‌తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదం పంచనుంది.

Tags:    

Similar News