‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సారి వచ్చేస్తున్నాడు

శ్రీకాంత్‌కు ఈసారి జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్‌లు కొత్త విలన్లుగా సవాల్ విసురుతున్నారు. దేశం లోపల, వెలుపల నుంచి వచ్చే ముప్పులతో పాటు అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటూ శ్రీకాంత్ కొత్త రంగంలోకి అడుగుపెడతాడు.;

By :  K R K
Update: 2025-06-30 02:11 GMT

మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' టీజర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రైమ్ వీడియోలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ అదిరిపోయే యాక్షన్-థ్రిల్లర్ సిరీస్‌ మరోసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది.

రాజ్ అండ్ డీకే .. డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మితమైన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ తివారీ పాత్రలో కంటిన్యూ అవుతున్నాడు. శ్రీకాంత్ ఒక ఎలైట్ అండర్‌కవర్ స్పైగా దేశం కోసం తన విధులను నిర్వర్తిస్తూనే, మధ్యతరగతి కుటుంబంలో భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను సమతుల్యం చేసే పాత్రలో మళ్ళీ అదరగొట్టబోతున్నాడు.

ఈ సీజన్‌లో సుమన్ కుమార్, తుషార్ సేత్‌లు రాజ్ అండ్ డీకేలతో కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ ప్రకారం.. శ్రీకాంత్‌కు ఈసారి జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్‌లు కొత్త విలన్లుగా సవాల్ విసురుతున్నారు. దేశం లోపల, వెలుపల నుంచి వచ్చే ముప్పులతో పాటు అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటూ శ్రీకాంత్ కొత్త రంగంలోకి అడుగుపెడతాడు. ఈ సీజన్‌లో ప్రియమణి (సుచిత్ర తివారీ), షరీబ్ హష్మీ (జేకే తల్పాడే), ఆశ్లేషా ఠాకూర్ (ధృతి తివారీ), వేదాంత్ సిన్హా (అథర్వ తివారీ) తదితరులు కీలక పాత్రల్లో తిరిగి కనిపిస్తారు. త్వరలోనే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Tags:    

Similar News