‘ఢిల్లీ క్రైమ్’ సీజన్ 3 కోసం రంగంలోకి అందమైన విలన్ !
తాజా సమాచారం ప్రకారం... ‘ఢిల్లీ క్రైమ్’ సీజన్ 3 ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది.;
అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న క్రైమ్ డ్రామా సిరీస్ ‘ఢిల్లీ క్రైమ్’ గత రెండు సీజన్స్.. అభిమానులను ఎంతగానో అలరించాయి. షెఫాలీ షా ప్రధాన పాత్రలో అదరగొట్టిన ఈ సిరీస్ మూడో సీజన్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ నటి హ్యూమా ఖురేషి ఈ సీజన్‌కు ప్రధాన ప్రతినాయకురాలిగా టీమ్ లోకి చేరినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ‘ఢిల్లీ క్రైమ్’ సీజన్ 3 ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సీజన్‌లో హ్యూమా ఖురేషి ఓ పవర్ ఫుల్ విలన్ గా కనిపించ నున్నట్లు టాక్ . ఈ సారి ఆమె పాత్ర డీసీపీ వర్తికా చతుర్వేదికి (షెఫాలీ షా) ప్రధాన ప్రత్యర్థిగా నిలవబోతోంది.
హ్యూమా ఖురేషి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఈ సిరీస్‌లో ప్రతినాయక పాత్రను పోషించాలని దర్శకులు తనని సంప్రదించినప్పుడు.. ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది అని ఆమె తెలిపింది. ఈ సీజన్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. షెఫాలీ షాతో పాటు, రసికా దుగ్గల్, రాజేష్, తైలాంగ్ మళ్లీ తమ పాత్రల్లోకి వస్తున్నారు. ఈ సీజన్‌కు తనుజ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఢిల్లీ క్రైమ్’ సిరీస్‌లో దిల్లీలో జరిగిన ఘోరమైన నేరాలపై పోలీస్ బృందం దర్యాప్తు చేపడుతుంది. మొదటి సీజన్ 2012 ఢీల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా నిర్మించగా... రెండో సీజన్ కచ్చా బనియన్ గ్యాంగ్ నేరాలపై రూపొందించ బడింది. మూడో సీజన్ కోసం ఈ రెండింటినీ మించిన ఒక క్రైమ్ డ్రామాతో ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నారు మేకర్స్.
‘ఢిల్లీ క్రైమ్’ సీజన్ 3 ఈ ఏడాది లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా షెఫాలీ షా ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 గురించి ఫిబ్రవరి 3న తెలుసుకోండి అని ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. హుమా ఖురేషి గతంలో మహారాణి, మిధ్య వంటి ఓటీటీ షోస్ లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సినిమాల పరంగా ఆమె జాలీ యల్ యల్ బీ 3లో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలతో కలిసి నటిస్తోంది.