ఓటీటీలోకి మరో మల్లూ క్రైమ్ థ్రిల్లర్
సౌబిన్ షాహిర్, బేసిల్ జోసఫ్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రావిన్ కూడు షాప్పు’. ఏప్రిల్ 11న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కాబోతోంది. నూతన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాటి కల్లు దుకాణంలో జరిగిన హత్యను కేంద్రంగా సాగే పరిశోధనా థ్రిల్లర్. ఈ చిత్రం జనవరి 16న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది.
చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్, నియాస్ అబూబక్కర్, శబరీష్ వర్మ, శివజిత్ పద్మనాభన్, జోసెఫ్, జార్జ్, విజో (మణి), సందీప్, రేవతి, రామ్‌కుమార్, దేవరాజ్, ప్రతాపన్, జ్యోతిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అన్వర్ రషీద్ నిర్మించిన ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు
సాధారణంగా మర్డర్ స్టోరీస్ ‘ఎవరు? ఎందుకు? ఎలా?’ అనే మూడు అంశాల చుట్టూ తిరుగుతాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఎక్కువగా ‘ఎవరు చేశారు?’ అనే కోణంపైనే దృష్టి సారించారు. ‘ఎలా జరిగింది?’ అనే అంశాన్ని ఎక్కువ భాగం పట్టించుకోకుండానే కథ సాగిపోతుంది. చివరికి ఇద్దరు సాధారణ వ్యక్తులు హఠాత్తుగా దానిని చేధించడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
హత్య మలుపులు, దాని ప్రదర్శన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. మోటివ్ బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది. అనుమానాస్పద పాత్రలు ప్రేక్షకుల ఉత్సుకతను పెంచాల్సినప్పటికీ, అది పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. మరి ఓటీటీ లో అయినా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.