ఆహా లో సరికొత్త వెబ్ సిరీస్ ‘హోం టౌన్’
By : Surendra Nalamati
Update: 2025-03-03 04:15 GMT
మన ఇంటికి, కుటుంబానికి సంబంధించిన బంధాలు, జ్ఞాపకాలను చక్కగా అల్లుకున్న ఓ వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. త్వరలోనే ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరామ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రలు పోషించారు.
ఈ సిరీస్‌లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన నటనతో ఆకట్టుకోనున్నారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, సినిమాటోగ్రఫీకి దేవ్ దీప్ గాంధీ కుండు, సంగీతానికి సురేష్ బొబ్బిలి పని చేశారు. ప్రతి కుటుంబ ప్రేక్షకుడికీ దగ్గరగా అనిపించే ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.