చిరుతో సినిమా ఎందుకు ఆగిపోయింది?
చిరంజీవితో సినిమా చేయాలని కలలు కంటున్న యువ దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకడు. ‘భీష్మ’ వంటి విజయవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన తర్వాత, మెగాస్టార్ కోసం ప్రత్యేకమైన కథను సిద్ధం చేశాడు.;
చిరంజీవితో సినిమా చేయాలని కలలు కంటున్న యువ దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకడు. ‘భీష్మ’ వంటి విజయవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన తర్వాత, మెగాస్టార్ కోసం ప్రత్యేకమైన కథను సిద్ధం చేశాడు. చాలా రోజులు చిరు-వెంకీ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయి. అయితే చివరకు చిరంజీవితో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కి బ్రేకులు పడ్డాయి.
ఇదే విషయాన్ని లేటెస్ట్ గా 'రాబిన్‌హుడ్' ప్రమోషన్స్ లో ప్రస్తావించాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. 'భీష్మ తర్వాత చిరంజీవి గారికోసం ఓ కథ సిద్ధం చేశాను. మొదట ఐడియా చెప్తే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయనతో సినిమా చేయడం అంటే నాకు కలలాంటి విషయం. అందుకే కథ, స్క్రీన్‌ప్లే పరంగా గట్టిగా కష్టపడ్డాను. కానీ ఎక్కడో ఒకచోట ఆయనని పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాను. కథను మరింత బలంగా తయారు చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయాను' అని వివరించాడు. మరి.. త్వరలోనే చిరంజీవితో వెంకీ కుడుముల కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.