నాగార్జున 100 చిత్రానికి దర్శకుడు ఎవరు?

Update: 2025-05-06 06:20 GMT

కింగ్ నాగార్జున 100వ చిత్రం కోసం సిద్ధమవుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న చర్చ అంత సానుకూలంగా లేదనిపిస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా తమిళ యు వ దర్శకుడు రా. కార్తిక్ ఎంపికయ్యాడు. అతడి తొలి చిత్రం 'నితమ్ ఓరు వానం' (తెలుగులో ఆకాశం) విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే, నాగార్జున కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటారు గానీ, ఇది ఇలా ప్రయోగాత్మక నిర్ణయం తీసుకునే సమయం కాదని అభిమానులు భావిస్తున్నారు.

నాగార్జున అభిమానులు ఆయన 100వ చిత్రాన్ని ఘనంగా, మాస్ హంగులతో, కమర్షియల్ డైరెక్టర్‌తో చూడాలని ఆశించారు. కనీసం మాస్, డాన్ వంటి హిట్లు ఇచ్చిన రాఘవ లారెన్స్ లాంటి మధ్య స్థాయి దర్శకుడైనా తీసుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తికి కారణం నాగార్జునకు ఇటీవల వచ్చిన వరుస పరాజయాలే. 'ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది గోస్ట్, మన్మథుడు 2, బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.

నాగార్జునకు చివరిసారిగా సొలో హిట్‌గా నిలిచింది సోగ్గాడే చిన్నినాయనా (2016). అలాంటి కీలక 100వ చిత్రం కోసం మళ్లీ ప్రయోగం చేయడమా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, రా. కార్తిక్ దర్శకుడిగా ప్రతిభావంతుడే. ఆయన తొలి చిత్రం కొత్త కథనశైలి, భావోద్వేగాలకు పెట్టింది పేరు.

నిరంతరం వైవిధ్యమైన చిత్రాలను ప్రయత్నించే నాగార్జునకు ఇది ఒక అర్థవంతమైన ప్రయోగంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ స్థితిని పరిగణలోకి తీసుకుంటే, పెద్ద దర్శకుడు సిద్ధపడటం కష్టమే. అందుకే, పరిమిత బడ్జెట్‌లో ఓ విలువైన కధను చెప్పగల యువ దర్శకుడిని ఎంపిక చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయంగా కనిపించవచ్చు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుగా నాగార్జున కుబేరా (ధనుష్‌తో), కూలీ (రజనీకాంత్‌తో) చిత్రాల్లో కనిపించనున్నారు. అవి పూర్తైన తర్వాతే ఈ 100వ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది అభిమానులు కోరుకున్న మాస్ ఎంటర్‌టైనర్ కాకపోవచ్చు, కానీ కథ బలంగా ఉంటే నాగార్జున 100వ సినిమా మరోసారి ఆయన్ని ట్రాక్ లో పెట్టవచ్చు.

Tags:    

Similar News