బాలీవుడ్ లో కి మీనాక్షి చౌదరి?
బాలీవుడ్ లో కి మీనాక్షి చౌదరి?రష్మిక మందన్నా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ వరకు అనేక మంది సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే బాటలో మీనాక్షి చౌదరి కూడా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి తెలుగు సినిమాల్లో ఆమె తన నటనా ప్రతిభను ప్రదర్శించినా, ఇంకా టాలీవుడ్‌లోని టాప్ హీరోల దృష్టిని పూర్తిగా ఆకర్షించలేకపోయింది. ‘గుంటూరు కారం’ వంటి పెద్ద హీరో సినిమాల్లో చిన్న పాత్రలు చేసినా, ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.
ఈ నేపథ్యంలో మీనాక్షి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ (డినేష్ విజన్ సంస్థ) నిర్మించే ఓ యువతరం ఆకట్టుకునే కథా చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి ఆమెకు సరిపడే హీరోను ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నారు.
ఇటీవలి కాలంలో పలువురు సౌత్ హీరోయిన్‌లు బాలీవుడ్ ప్రయాణం ప్రారంభించినా మొదట్లో కొంత వెనుకబడినా, ఆ తర్వాత విజయాలతో తిరిగి నిలదొక్కుకున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీనాక్షి చౌదరి బాలీవుడ్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. ఆమె కొత్త చాప్టర్ ఎలాంటి విజయాలను తెస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీప్రియులు.