చిన్న సినిమా.. పెద్ద కలెక్షన్లు!

సినిమా రంగంలో పెద్ద హీరోలు, భారీ కాంబినేషన్లు ఉన్న ప్రాజెక్ట్‌లే సక్సెస్ అవుతాయనుకోవడం సాధారణం. కానీ ఆ మైండ్‌సెట్‌కి గట్టి షాక్ ఇచ్చిన చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'.;

By :  S D R
Update: 2025-09-08 00:56 GMT

సినిమా రంగంలో పెద్ద హీరోలు, భారీ కాంబినేషన్లు ఉన్న ప్రాజెక్ట్‌లే సక్సెస్ అవుతాయనుకోవడం సాధారణం. కానీ ఆ మైండ్‌సెట్‌కి గట్టి షాక్ ఇచ్చిన చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఇటీవల థియేటర్స్‌కి వచ్చిన ఈ చిత్రం, అనుష్క–క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఘాటి', మురుగదాస్–శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన 'మదరాసి' సినిమాలను కూడా వెనక్కి నెట్టేసి, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తుంది.

సోషల్ మీడియా స్టార్ మౌళి తనూజ్, హీరోయిన్‌గా శివాని నగారం, దర్శకుడిగా మీమ్స్ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన సాయి మార్తాండ్‌ – ఇలాంటి కొత్త కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా సక్సెస్ గురించి ముందు ఎవరు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. కానీ రిలీజ్‌కి ముందురోజే పెట్టిన పెయిడ్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది. తొలి రోజు అది మరింతగా వ్యాపించి, సినిమాకు ఊహించని స్థాయిలో బజ్ వచ్చింది.

మొదటి రోజే కోటిన్నర గ్రాస్‌ సాధించిన ఈ సినిమా, రెండో రోజు కలెక్షన్లను ఇంకా పెంచుకోవడం విశేషం. బుక్ మై షోలో రెండో రోజే లక్షకు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాకి వచ్చిన పాప్యులారిటీని స్పష్టంగా చూపించింది. మొత్తంగా రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిందనేది ఇండస్ట్రీ టాక్. ఈ మధ్యకాలంలో ఇంత వేగంగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఇదే కావచ్చు.

'లిటిల్ హార్ట్స్‌'లో పెద్దగా కథేమీ లేదు. కానీ సింపుల్ లైన్‌తోనే యూత్‌కు కనెక్ట్ అయ్యేలా, నాన్‌స్టాప్ కామెడీతో వినోదం పంచడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా బయటకు వస్తున్నారు. పైసా వసూల్ సినిమా అని టాక్ స్ప్రెడ్ అవ్వడంతో యూత్ ఎగబడి ఈ సినిమాను చూస్తున్నారు. మరి.. లాంగ్ రన్ లో 'లిటిల్ హార్ట్స్' ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News