రోజా కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎక్కువగా కనిపిస్తున్నా, హీరోయిన్‌ల విషయంలో మాత్రం ఆ సంఖ్య తక్కువ. అయితే తాజాగా సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కూతురు అన్షు సినీ రంగ ప్రవేశానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్‌లో అన్షు ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆమె ర్యాంప్ వాక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని చర్చ మొదలైంది. ఆకర్షణీయమైన లుక్స్, మంచి ఫిజిక్‌తో అన్షు హీరోయిన్‌గా మంచి విజయాలు సాధించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అన్షు పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఫ్యాషన్ షోల ద్వారా గ్లామర్ ఫీల్డ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ అన్షు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, అభిమానులు ఆమె హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరి అన్షు వెండితెర అరంగేట్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.