'RC16'లో రణ్‌బీర్ కేమియోపై నిజమేమిటి?
'RC16' మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపైనా ఇంకా క్లారిటీ లేదు.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'RC16'. ఆద్యంతం గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. స్పోర్ట్స్ మ్యాన్ లుక్ లో కనిపించేందుకు ఫిట్‌నెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు.
ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ప్రకటించారు. మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే రెహమాన్ కొన్ని పాటలు కూడా ఇచ్చాడు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి రెహమాన్ తప్పుకున్నాడని.. ఆ స్థానంలో దేవిశ్రీప్రసాద్ వచ్చాడనే రూమర్స్ ప్రచారమయ్యాయి. వాటన్నింటినీ ఖండించింది టీమ్.
లేటెస్ట్ గా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపైనా ఇంకా క్లారిటీ లేదు. చిత్రబృందం 'RC16'లోని కేమియో కోసం రణ్‌బీర్ ని సంప్రదించలేదనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
మరోవైపు ఈ మూవీలో ఓ కీలక పాత్రను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన కేన్సర్ సర్జరీని పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగొచ్చాడు. మార్చి నుంచి 'RC16' సెట్స్ లో శివరాజ్ కుమార్ పాల్గొంటాడట. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.