ఫిష్ వెంకట్‌కు విశ్వక్ సేన్ సాయం
సినీ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.;
By : S D R
Update: 2025-07-08 11:23 GMT
సినీ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నాలుగేళ్లుగా డయాలసిస్‌పై ఆధారపడి జీవిస్తున్న ఆయనకు ప్రస్తుతం రెండు కిడ్నీలూ పని చేయకపోవడంతో వైద్యులు అత్యవసరంగా మార్పిడి చేయాలని సూచించారు.
ఈ క్రమంలో వైద్య ఖర్చుల భారం కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తుండగా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఉదారత చాటుకున్నాడు. వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన ఆయన రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని తన టీమ్ ద్వారా అందించారు.
వెంకట్ కుమార్తె స్రవంతి ప్రకారం, చికిత్సకు సుమారు రూ. 50 లక్షలు అవసరం అవుతుండగా, దాతల సహకారం అత్యవసరమని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఫిష్ వెంకట్ సతీమణి సువర్ణ, కుమార్తె స్రవంతి విజ్ఞప్తి చేశారు.