'లైలా'గా మారడానికి విశ్వక్ చేసిన మేకోవర్!
హీరోలు లేడీ గెటప్ వేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ గెటప్ కోసం మహిళలుగా మారడం పెద్ద ప్రాసెస్. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్, వాయిస్ కల్చర్ ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో కసరత్తులు చేయాల్సి ఉంటుంది.;
ఫిబ్రవరిలో ప్రేమికులరోజు కానుకగా రాబోతున్న చిత్రాలలో విశ్వక్ సేన్ 'లైలా' ఒకటి. ఈ సినిమాలో ఒకవైపు తన మార్క్ మాస్ ఎలివేషన్స్ లో మెప్పిస్తూనే మరోవైపు లేడీ గెటప్ లోనూ మురిపించనున్నాడు విశ్వక్. ఇప్పటికే టీజర్ లో విశ్వక్ సేన్ పోషించిన లైలా క్యారెక్టర్ విజువల్స్ ను పరిచయం చేశారు. తాజాగా ఆ పాత్ర కోసం విశ్వక్ ఎలా మేకోవర్ అయ్యాడు? అనే ఆసక్తికర విజువల్స్ తో మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.
హీరోలు లేడీ గెటప్ వేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ గెటప్ కోసం మహిళలుగా మారడం పెద్ద ప్రాసెస్. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్, వాయిస్ కల్చర్ ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో కసరత్తులు చేయాల్సి ఉంటుంది.ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే లైలా రోల్ కోసం విశ్వక్ కూడా అలాంటి కసరత్తులే చేసినట్టు అనిపిస్తుంది. మరి.. విశ్వక్ లేడీ గెటప్ లో ఏ రీతిన ఆకట్టుకోబోతున్నాడో తెలియాలంటే ఫిబ్రవరి 14న సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.