'జన నాయగన్'గా రాబోతున్న విజయ్!

తమిళ దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 69వ చిత్రానికి టైటిల్ ఖరారయ్యింది. ఈ సినిమాకి 'జన నాయగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.;

By :  S D R
Update: 2025-01-26 08:13 GMT

తమిళ దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 69వ చిత్రానికి టైటిల్ ఖరారయ్యింది. ఈ సినిమాకి 'జన నాయగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఓ వాహనం పై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాన్ని చూపించారు. విజయ్ వెనుకవైపు తెల్ల దుస్తుల్లో ప్రజల గుంపు ఉండటం గమనించొచ్చు. 'జన నాయగన్' టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యంలో ఉండే సినిమాగా కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. తన పొలిటికల్ కెరీర్ కు అద్దం పట్టేలా ఈ సినిమాని చేయబోతున్నట్టు తెలుస్తోంది.

పూర్తి స్థాయి రాజకీయాలకు ముందు విజయ్ నటించే చివరి చిత్రం ఇదే అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా పూజా హెగ్డే, మమిత బైజు నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి వంటి వారు కనిపించబోతున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags:    

Similar News