‘సార్ మేడమ్‘గా విజయ్, నిత్యా!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’.;
By : S D R
Update: 2025-07-10 09:55 GMT
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ‘సార్ మేడమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
లేటెస్ట్ గా ‘సార్ మేడమ్‘ టైటిల్ టీజర్ రిలీజయ్యింది. ఈ టీజర్ లో మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల పాత్రల్లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ సహజంగా ఆకట్టుకుంటున్నారు. వారి మధ్య జరిగే సంభాషణలు, హాస్యభరిత సన్నివేశాలు బాగున్నాయి. జూలై 25న ‘సార్ మేడమ్‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.