వెంకీ డైరెక్షన్ లో నెక్ట్స్ లెవల్!

తొలి చిత్రం 'తొలిప్రేమ'తోనే హిట్ కొట్టిన వెంకీ అట్లూరి.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ఫెయిల్యూర్ తో విమర్శలు ఎదుర్కొన్నాడు.;

By :  S D R
Update: 2025-04-16 00:23 GMT

తొలి చిత్రం 'తొలిప్రేమ'తోనే హిట్ కొట్టిన వెంకీ అట్లూరి.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ఫెయిల్యూర్ తో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా.. తన పంథాను మార్చుకుని వరుసగా 'రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్' అంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ముఖ్యంగా 'సార్' మూవీ నుంచి కొత్త రూట్ తీసుకున్నాడు. ధనుష్‌తో చేసిన ఈ చిత్రం రెండు భాషల్లో హిట్ అవ్వడం వల్ల వెంకీ మల్టీ లింగ్వల్ డైరెక్టర్ గా మారిపోయాడు. దుల్కర్ తో చేసిన 'లక్కీ భాస్కర్'తోనూ అదే కొనసాగించాడు. ఇప్పుడు సౌత్ లోని స్టార్స్ అంతా వెంకీతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సూర్య 46 తో బిజీగా ఉన్నాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా రూపొందనుంది. సూర్య మూవీ తర్వాత అజిత్ ను కూడా లైన్లో పెడుతున్నాడట. త్వరలోనే అజిత్ కి స్టోరీ వినిపించనున్నట్టు కోలీవుడ్ టాక్. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గతంలోనే వెంకీ అట్లూరికి పిలిచి ఆఫర్ ఇచ్చారు. మొత్తంగా.. వెంకీ అట్లూరి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ స్టార్స్ తో సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

Tags:    

Similar News