కొరియా వెళ్లనున్న వరుణ్!
ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే వరుణ్ తేజ్ ఈసారి మరో వైవిధ్యభరితమైన పాత్రతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ వినూత్నమైన హారర్-కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు.;
ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే వరుణ్ తేజ్ ఈసారి మరో వైవిధ్యభరితమైన పాత్రతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ వినూత్నమైన హారర్-కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ‘VT15’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ అనంతపురంలో షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్లో వరుణ్ తేజ్, కథానాయిక రితికా నాయక్లపై మాస్ బీట్తో కూడిన పాటను చిత్రీకరించడమే కాకుండా, కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. జూన్ నుంచి సౌత్ కొరియాలో కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. అక్కడ కీలకమైన హారర్ సీక్వెన్సులు చిత్రీకరించనున్నారు.
ఇండో-కొరియన్ థీమ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇందులో సత్య, మిర్చి కిరణ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.