వాలెంటైన్స్ డే మూవీ వార్.. ఎవరు గెలుస్తారు?
ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగబోతుంది. రెండు పాత సినిమాలు, రెండు కొత్త చిత్రాల మధ్య క్లాష్ ఇంట్రెస్టింగ్ మారుతోంది.;
ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగబోతుంది. రెండు పాత సినిమాలు, రెండు కొత్త చిత్రాల మధ్య క్లాష్ ఇంట్రెస్టింగ్ మారుతోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విశ్వక్ సేన్ 'లైలా', బ్రహ్మానందం 'బ్రహ్మ ఆనందం' సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
వీటితో పాటు పాత చిత్రాలు రామ్ చరణ్ 'ఆరెంజ్', సిద్ధు జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిస్ లీల' సరికొత్తగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. పాత సినిమాలే అయినా చరణ్ 'ఆరెంజ్', సిద్ధు జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిస్ లీల' సినిమాలు లవ్ స్టోరీస్ లో ఓ కొత్త పాయింట్స్ ను టచ్ చేసిన మూవీస్ గా పేరు సంపాదించాయి.
'మగధీర' వంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో 'ఆరెంజ్'పై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను 'ఆరెంజ్' అందుకోలేకపోయింది. అయినా ఇప్పటికీ ప్రేమకథా చిత్రాల్లో 'ఆరెంజ్' మూవీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్.
స్టార్ బాయ్ సిద్ధు 'కృష్ణ అండ్ హిస్ లీల' చిత్రం 'ఇట్స్ కాంప్లికేటెడ్' టైటిల్ తో సరికొత్తగా వస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని నటించారు. 'కృష్ణ అండ్ హిస్ లీల' 2020, జూన్ లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజయ్యింది. అప్పటికే ట్రెండీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. లవర్స్ డే స్పెషల్ గా ఆడియన్స్ ను అలరిస్తుందనే నమ్మకంతో ఉంది టీమ్.