యూత్‌ఫుల్ ఎనర్జీతో ‘వచ్చార్రోయ్’!

యూత్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి.;

By :  S D R
Update: 2025-03-18 14:22 GMT

యూత్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదలైన ‘వచ్చార్రోయ్’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. భీమ్స్ హుషారైన బీట్‌తో ఈ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది.


Full View


Tags:    

Similar News