రామ్ సినిమాలో ఉపేంద్ర
యాక్షన్ ను కాసేపు పక్కన పెట్టి.. ఇప్పుడు పూర్తిగా రొమాంటిక్ గా మారిపోయాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ 22వ సినిమా రెడీ అవుతుంది.;
యాక్షన్ ను కాసేపు పక్కన పెట్టి.. ఇప్పుడు పూర్తిగా రొమాంటిక్ గా మారిపోయాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో రామ్ 22వ సినిమా రెడీ అవుతుంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ను మే 15న రామ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించడం, ఆయన ఓ.కె. చెప్పడం జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే.. ఆ రోల్ లోనే ఇప్పుడు కన్నడ స్టార్ ఉపేంద్ర కనువిందు చేయబోతున్నాడు. ఉపేంద్ర ఈ మూవీలో నటిస్తున్నట్టు కన్ఫమ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమాలో సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర అలరించబోతున్నాడు.
ఉపేంద్ర వాస్తవ జీవితానికి దగ్గరగానే ఈ పాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ‘అందనివాడు.. అందరివాడు‘ అంటూ ఈ మూవీలో ఉపేంద్ర ఓ సూపర్ స్టార్ రోల్ లో కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చింది టీమ్. కోలీవుడ్ మ్యూజికల్ డ్యూయో వివేక్-మెర్విన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 15న వచ్చే టైటిల్ గ్లింప్స్ లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.