విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ కన్‌ఫర్మ్!

Update: 2025-03-05 07:32 GMT

ఈనెలలో పలు సూపర్ హిట్ మూవీస్ మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్-మహేష్ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘. మార్చి 7న గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలను మీడియాతో ముచ్చటించారు నిర్మాత దిల్ రాజు.

ఈ సందర్భంగా తమ బ్యానర్ నుంచి రాబోయే అప్ కమింగ్ మూవీస్ గురించి హింట్ ఇచ్చారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కొలా తెరకెక్కించే సినిమాకి ‘రౌడీ జనార్థన్‘ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిపారు. అలాగే నితిన్ తో వేణు తెరకెక్కించే ‘ఎల్లమ్మ‘ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుందని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు మే నుంచి పట్టాలెక్కనున్నట్టు హింట్ ఇచ్చారు దిల్ రాజు. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి నితిన్ ‘తమ్ముడు‘ కూడా రాబోతుంది.

Tags:    

Similar News