సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ‘కింగ్ డమ్’

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా కోసం అభిమానుల్లో హైప్ మరింత పెరిగిపోతోంది.;

By :  K R K
Update: 2025-07-27 00:35 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌డమ్’. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్వకత్వంలో రూపొందిన ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా కోసం అభిమానుల్లో హైప్ మరింత పెరిగిపోతోంది.

తాజాగా విజయ్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఒక సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. వీళ్లిద్దరి కాజువల్ వైబ్, సినిమా గురించిన మాటలు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అలాగే తాజాగా విడుదలైన ట్రైలర్ ఫుల్ యాక్షన్, డీప్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది.

“ది గన్ ఈజ్ లోడెడ్. ది రేజ్ ఈజ్ రియల్” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా తీవ్రత గురించి హింట్ ఇస్తోంది. విజయ్‌ని మళ్లీ హై-ఎనర్జీ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, అనిరుధ్ మ్యూజిక్‌తో రూపొందిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన కింగ్‌డమ్ జులై 31న థియేటర్లలో సందడి చేయనుంది.

Tags:    

Similar News