విజయ్ అండ్ రష్మికా మళ్లీ దొరికేశారు !

ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ని ఓపెన్‌గా చెప్పకపోయినా, క్లూస్ డ్రాప్ చేయడం మాత్రం ఆపలేదు. జాయింట్ హాలిడేస్, ఒకేలాంటి ఫోటో బ్యాక్‌గ్రౌండ్స్, విజయ్ ఇంట్లో రష్మిక కనిపించడం.. ప్రతి సంఘటన స్పెక్యులేషన్‌కి మరింత ఆజ్యం పోస్తోంది.;

By :  K R K
Update: 2025-06-19 01:16 GMT

ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి బయటకు వచ్చారు. దీంతో ఇంటర్ నెట్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. మాస్క్‌లు పెట్టుకుని, ఒకే కారులో సైలెంట్‌గా కూర్చున్న ఈ జోడీ, దాచడానికి పెద్దగా ట్రై చేయలేదు. పైగా ఏమీ మాట్లాడలేదు కూడా. వాళ్లు చేసిన సైలెంట్ ఎగ్జిట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఫ్యాన్స్, కెమెరాలు ప్రతి ఫ్రేమ్‌ని స్పాట్ చేసేశాయి.

ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ని ఓపెన్‌గా చెప్పకపోయినా, క్లూస్ డ్రాప్ చేయడం మాత్రం ఆపలేదు. జాయింట్ హాలిడేస్, ఒకేలాంటి ఫోటో బ్యాక్‌గ్రౌండ్స్, విజయ్ ఇంట్లో రష్మిక కనిపించడం.. ప్రతి సంఘటన స్పెక్యులేషన్‌కి మరింత ఆజ్యం పోస్తోంది. వాళ్ల పబ్లిక్ సైలెన్స్ క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది. రష్మిక రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో శారీలో పోస్ట్ చేసిన ఫోటో మరో హాట్ టాపిక్. శారీ కంటే ఆ సెట్టింగ్ ఎక్కువ దృష్టి తీసుకుంది. ఫ్యాన్స్ ఆ ఫోటోని విజయ్ గత ఫోటోలతో మ్యాచ్ చేసి, ఆ శారీని విజయ్ తల్లి గిఫ్ట్ చేసి ఉండొచ్చని గెస్ చేశారు.

రష్మిక క్యాప్షన్‌లో స్పెషల్ సమ్‌వన్ ఫోటో తీసినట్టు హింట్ ఇవ్వడంతో, ఫ్యాన్స్ వెంటనే విజయ్‌ని టార్గెట్ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఇద్దరూ సూపర్ బిజీ. రష్మిక ‘థామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘కాక్‌టైల్ 2’, ‘రెయిన్‌బో’, ‘ఏక్ సాత్ దో దో’లతో ఫుల్ స్వింగ్‌లో ఉంది. విజయ్ ‘కింగ్‌డమ్’, యస్వీసీ 59’, ‘వీడీ14’తో రెడీ అవుతున్నాడు. ఆఫ్-స్క్రీన్‌లో వాళ్లు సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ ప్రతి స్టెప్‌ని ఫ్యాన్స్ గమనిస్తున్నారు.

Tags:    

Similar News