ఇద్దరు క్రేజీ హీరోలతో విఐ ఆనంద్ భారీ మల్టీస్టారర్ !
“ఎక్కడికి పోతావు చిన్నవాడా”, ఇటీవల విడుదలైన “ఊరు పేరు భైరవకోన” వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన విఐ ఆనంద్, ఇప్పుడు ఇద్దరు క్రేజీ హీరోలతో ఒక అదిరిపోయే మల్టీ-స్టారర్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.;
థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు విఐ ఆనంద్ మరో విభిన్నమైన సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రూపొందించ బోతున్న ఒక భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
“ఎక్కడికి పోతావు చిన్నవాడా”, ఇటీవల విడుదలైన “ఊరు పేరు భైరవకోన” వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన విఐ ఆనంద్, ఇప్పుడు ఇద్దరు క్రేజీ హీరోలతో ఒక అదిరిపోయే మల్టీ-స్టారర్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. “హనుమాన్” వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఆయన ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో “సంబరాల ఏటి గట్టు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రానికి నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరు క్రేజీ హీరోలతో విఐ ఆనంద్, నిరంజన్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్రధాన పాత్రధారులు ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ప్రాజెక్ట్ తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందనుందని చిత్రబృందం చెబుతోంది.