వెంకీ - త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్పటినుంచే !

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ‘కేజీఎఫ్, హిట్ 3’ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో కథానాయికగా ఎంపికైంది.;

By :  K R K
Update: 2025-09-22 12:31 GMT

విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. వెంకటేష్‌తో ఓ సినిమా చేయాలని చాలా కాలంగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన కోరిక ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ‘కేజీఎఫ్, హిట్ 3’ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో ఒక డార్క్ క్రైమ్ యాంగిల్ కూడా ఉంది. అలాగే .. త్రివిక్రమ్ స్టైలాఫ్ కామెడీకి ఎలాంటి ఢోకా లేదు.

ఇక ఈ చిత్రానికి కథానాయికలుగా.. త్రిష, మీనాక్షి చౌదరి పేర్లను కూడా నిర్మాతలు పరిశీలించారు. కానీ శ్రీనిధి శెట్టిని ఫైనల్ గా ఖరారు చేశారు. త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాకి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమా చాలా చర్చల తర్వాత ఆగిపోయింది.

అదే సమయంలో యన్టీఆర్ హీరోగా ఒక పౌరాణిక చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అది భారీ చిత్రం కావడంతో ఈ గ్యాప్ లో వెంకటేష్ కోసం త్రివిక్రమ్ ఓ డార్క్ కామెడీ స్క్రిప్ట్ రాసి ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News